ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని వెల్లడించింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.