కార్తీక దీపం సీరియల్ 1259వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నేటి ఎపిసోడ్ లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 'అమ్మా నాన్న ఇంకా రాలేదా? ఆ రుద్రాణి మనుషులు వెళ్తూ వెళ్లూ మీ నాన్న జాగ్రత్త అని చెప్పి వెళ్లారు అమ్మా’ అంటూ పిల్లలు కంగారుపడతారు. దీప వాళ్లకి సర్ది చెప్పి పంపిస్తుంది. డాక్టర్ బాబు జోలికి వస్తే ఆ దేవుడినైనా ఎదిరిస్తానంటూ తనలో తనే అనుకుంటుంది దీప.
ఇక మోనిత తన ఫొటోని ఫోన్‌లో చూసుకుంటూ.. ‘లెక్క ఎక్కడ తప్పింది మోనితా.. ఎందుకు ఇలా మిగిలిపోయావ్’ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో భారతి వస్తుంది. కార్తీక్ ను దక్కించుకోవడమే తన జీవిత లక్ష్యం అని అంటుంది మోనిత. ‘ఏంటో మోనితా కార్తీక్ పాపం.. ఎన్నో విజయాలు సాధించిన కార్తీక్ లైఫ్‌కి అలా బ్రేక్ పడింది. ఆపరేషన్ చేసే ముందు వరకూ బాగానే ఉన్నాడట.. సడన్‌గా తనకు ఏదో కళ్లు తిరిగినట్లు అయ్యిందట’ అని భారతి అనగానే తన చేసిన కుట్ర మొత్తం, ఆపరేషన్‌కి వెళ్లే ముందు మత్తు కలిపిన కాఫీ తాగించడం అంతా గుర్తు చేసుకుంటుంది మోనిత. కొంపదీసి ఆపరేషన్ జరిగేటప్పుడు నువ్వు ఏదైనా కార్తీక్‌కి?’ అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది. ‘భారతి ఏం మాట్లాడుతున్నావ్..?’ అంటుంది మోనిత కంగారు పడుతూ.. ‘మోనితా నాకు నీ క్రిమినల్ బ్రెయిన్ గురించి తెలుసు.. పాపం తనని నువ్వు ఏం చెయ్యలేదు కదా?’ అంటుంది భారతి కాస్త కోపంగా, అనుమానంగా చూస్తూ..
కార్తీక్ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలియదా? నేనేం చేస్తాను.. ఇలాంటి ఆలోచనలు తన మైండ్‌లోంచి తీసెయ్ భారతి అని మోనిత అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుంది. భారతి మాత్రం అనుమానంగానే చూస్తూ ఉంటుంది. మొత్తానికీ మోనిత చేసిన కుట్ర గురించి భారతి మరింత లోతుగా ఆరా తీస్తే విషయం బయటపడుతుంది. ఆ విషయాన్ని సౌందర్యకు చేరవేస్తుంది.
అది అలా ఉండగా అప్పారావు కార్తీక్‌కి నచ్చజెప్పి సినిమాకి(మ్యాట్నీ షో) బయలుదేరతాడు. ఇక దీప హోటల్ వైపు నడుస్తుంది. అప్పుడే ఓ రోడ్డు మీద మోనిత, ఆదిత్య ఎదురు పడతాడు. ‘మరిదిగారు బాగున్నారా వదినను నేను’ అంటూ మాటలతోనే విసుగు కలిగిస్తుంది. ఆదిత్య ఆవేశంలో ‘మనిషికో దెబ్బ అన్నారు అందుకే’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆదిత్య కోపంలో తన ఫోన్ మరిచిపోతాడు. దాంతో మోనిత ఆ ఫోన్ తన కారు టైర్ కింద పెట్టి ఎక్కిస్తూ.. ‘నన్నే అంత మాట అంటావా ఆదిత్యా’ అంటూ తన కోపాన్ని చల్లార్చుకుంటుంది.
ఇక హోటల్ లో కార్తీక్ క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. భద్రం పార్సిల్ తీసుకుని వెళ్తుంటే.. దీప ఎదురుపడుతుంది. ‘అమ్మా పార్సిల్ ఇచ్చి వచ్చే వరకూ క్యాష్ కౌంట్ దగ్గర ఉండమ్మా’ అని భద్రం వెళ్లిపోతాడు. దీప క్యాష్ కౌంటర్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండగా కార్తీక్ క్లీన్ చేస్తూ కనిపిస్తాడు. దీప కాస్త తొంగి చూస్తుంది. కార్తీక్కేనని అర్థం కావడంతో కళ్లనండా నీళ్లతో ‘ఏమండీ?’ అని అరుస్తుంది. కార్తీక్ వెనక్కి తిరిగి చేతిలోని చెత్త ఉన్న కంచం కిందకు జారేస్తాడు. దీప ఆవేశంగా కార్తీక్ దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని ఏం చేస్తున్నారండీ అంటుంది ఏడుస్తూ. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.