చలికాలంలో మార్నింగ్ వాక్ చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయంపూట అతిగా నడిస్తే గుండెపోటుకు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే తేమ ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. అందుకే వాకింగ్ కు వెళ్లే సమయాలను మార్చుకోవాలి. ఇంకా సూర్యరశ్మి ఉన్న సమయంలోనే బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ప్రమాదకర స్థాయిలో చలి ఉన్నరోజున వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.