రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో యువతే ఎక్కువ

52చూసినవారు
రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో యువతే ఎక్కువ
రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో పని చేసే వయస్సున్న వారే ఎక్కువ మంది ఉంటున్నారు. మొత్తం మృతుల్లో 66.5 శాతం 18–45 ఏళ్ల మధ్య వయస్సు కల్గినవారేనని గణాంకాలు చెబుతున్నాయి. అంటే యువతతో పాటు యావత్ కుటుంబం ఆధారపడ్డ వ్యక్తులే ఎక్కువ శాతం ఉన్నారని స్పష్టమవుతోంది. జాతీయ రహదారులే కాదు.. గ్రామీణ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు సైతం ఎక్కువ మంది ప్రాణాలు బలిగొంటున్నాయి.