కర్ణాటకలోని బెళగావిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని ఆరోపిస్తూ.. 60, 29 ఏళ్ల వయసు కలిగిన తల్లీకూతుళ్లపై స్థానికులు దాడి చేశారు. వారి బట్టలు చింపేసి దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు. మహిళలు ఇద్దరూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలతో పాటు పొరుగు కుటుంబానికి చెందిన పలువురు తమ ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి, ఇద్దరిపై భౌతికదాడికి దిగినట్లు చెప్పారు.