ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. బుడమేరు వాగుకు మూడు చోట్ల గండి పడడంతో సింగ్ నగర్ తో పాటు బుడమేరు పరిసర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను, ముంపునకు గురైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గర్భిణిని లోతట్టు ప్రాంతం నుంచి తరలిస్తుండగా.. ఆమె వరద నీటితో నడుస్తున్న ఫొటో వైరల్ అయింది.