బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్

78చూసినవారు
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్
‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ విజయాలతో జోరు చూపించింది మృణాల్‌ ఠాకూర్‌. ఇటీవల నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అయితే ప్రస్తుతం ఆమె హిందీలో సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. రవి ఉద్యావర్‌ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. సిద్ధాంత్‌ చతుర్వేది హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జూన్‌ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.