చిన్నారిపై దూసుకెళ్లిన మున్సిపాలిటీ వ్యాన్ (వీడియో)

572చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో మంగళవారం ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వీధిలో ఉన్న చెత్త తీసుకెళ్లేందుకు వచ్చిన మున్సిపాలిటీ వ్యాన్ ఇంటిబయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే చిన్నారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్