Mar 21, 2025, 17:03 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: టెన్త్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
Mar 21, 2025, 17:03 IST
వనపర్తి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 6, 853 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.