కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి వాహనదారుల మృతికి కారకులు కావొద్దని కల్వకుర్తి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ సోమవారం సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి నల్లని కవర్లు కప్పడంతో రాత్రివేళలో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని పేర్కొన్నారు. కావున రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బావుల వద్దనే ధాన్యం ఆరబోసుకోవాలన్నారు.