కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న జిల్లా మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కల్వకుర్తి పట్టణంలోని యుటిఎఫ్ భవన్లో ఆదివారం రౌండ్స్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు పూర్తిస్థాయిలో రుణ మాఫీలు అమలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.