Feb 15, 2025, 06:02 IST/
మహాకుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి
Feb 15, 2025, 06:02 IST
గుజరాత్లోని దాహోడ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళా నుంచి 10 మంది భక్తులు వ్యాన్లో గుజరాత్ బయలుదేరారు. ఈ క్రమంలో వ్యాన్ ఇండోర్-అహ్మదాబాద్ హైవేపై లింఖేడా సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.