ఇంకా దొరకని శంకర్ ఆచూకీ
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఎర్రపెంటకు చెందిన చెంచు యువకుడు నిమ్మల శంకర్ గత నెల 28న శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మిత్రుడు ఉడుతల కృష్ణయ్యతో కలిసి నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లారు. చీకటి పడటంతో అక్కడే వాగు సమీపంలో పడుకున్నామని, రాత్రివేళ మెలకువ వచ్చి చూస్తే శంకర్ కనిపించలేదని కృష్ణయ్య తెలిపారు. శంకర్ కోసం అడవిలోకి వెళ్లి పోలీస్ అధికారులు మూడు రోజులుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. ఆదివారం నుంచి డ్రోన్ ద్వారా సైతం గాలింపు చర్యలు చేపడతామని డీఎఫ్ఎ రోహిత్ గోపిడి తెలిపారు. భార్య లక్ష్మమ్మ, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.