కొల్లాపూర్: కోర్టులో కోళ్ల వేలం

55చూసినవారు
కొల్లాపూర్: కోర్టులో కోళ్ల వేలం
కొల్లాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ప్రాంగణంలో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టులో కోడేరు పోలీసులు కోళ్ల పందెం స్థావరం పై దాడి చేసి క్రైమ్ నెంబర్ 122/2024 9(ii) గేమింగ్ ఆక్ట్ క్రింద కేసు రిజిస్టర్ చేసి పట్టుకున్న 12 కోళ్లను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యోత్స్న గుంటి వాటిని శుక్రవారం వేలం వేశారు. ఈ వేలంలో వచ్చిన మొత్తం రూ. 39, 650 లను ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు.