

బిజినేపల్లి: జవహర్ లాల్ నెహ్రూకు నివాళి
బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని మంగళవారం గ్రామ కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులను అమితంగా ప్రేమించిన నాయకుడని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.