నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలోని వార్డు నెం9 సంజాపూర్ యందు ఈరోజు పురపాలక చైర్మన్ ఎడ్మ సత్యం టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చాలా అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు అందరికి తెలిసిందేనని, ఇక ముందు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టగల సత్తా కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే ఉందని ఆయన అన్నారు. కావున పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ ప్రతిష్ఠతను కాపాడుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మధు, రాజు, లక్ష్మయ్య, బాలకృష్ణ చారి, అనిత, అనసూయ, లక్ష్మమ్మ, భవాని, ముత్యలమ్మ, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.