పెద్దకొత్తపల్లి: కరెంట్ షాక్ తో రైతు మృతి
పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామానికి చెందిన రైతు కరెంట్ షాక్ తో మృతి చెందారు. గ్రామానికి చెందిన బాచారం శ్రీను సోమవారం విద్యుత్తు లైనుకు మరమ్మతులు చేస్తున్నగా కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శీను మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.