ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలించవచ్చునని అన్నారు ఎయిడ్స్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎయిడ్స్ అంటువ్యాధి కాదని బాధితులకు ధైర్యం నింపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు.