రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం వెన్న చర్ల గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన సందడి శైలేష్ (19) పంట పొలంలో పురుగు మందు పిచికారి చేసేందుకు తన ఇద్దరి స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. వెనకాల ఉన్న మరో ఇద్దరు యువకులు కిందికి దూకగా బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద నలిగి మృత్యువాత పడ్డాడు.