VIDEO: 8 ఏళ్ళ బాలికను చంపి.. గోనె సంచిలో చుట్టి రోడ్డుపై పడేశారు!

52చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణ ఘటన జరిగింది. మంగళవారం 8 ఏళ్ళ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికను చంపేసి, అర్ధ నగ్నంగా గోనె సంచిలో పెట్టి బుధవారం ఉదయం, బాలిక ఇంటికి 200 మీటర్ల దూరంలో మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. దీంతో స్థానికంగా తీవ్ర గందరగోళం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్