ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండోరోజు కంటి వైద్య శిబిరం
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్దండ మండలం ఏవిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం రెండో రోజు చేరింది. శంకర నేత్రాలయ వారిచే ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరానికి కల్వకుర్తి నియోజకవర్గం నుండి కంటి సమస్యలు ఉన్నవారు భారీగా తరలివస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.