అంగన్వాడీ కేంద్రాలలో ప్రి ప్రైమరీ తరగతులను నిర్వహించాలనే ప్రతిపాదన ప్రభుత్వ విద్యారంగానికి నష్టమని, రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్య విధానాన్ని అమలు చేయోద్దని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం కొండమల్లేపల్లిలో జరిగిన ఎస్ఎఫ్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, లక్ష్మి నారాయణ, శంకర్, లక్ష్మణ్, వెంకటేష్ పాల్గొన్నారు.