డ్రైవర్ నిర్లక్ష్యం నుజ్జునుజ్జైన ప్రయాణికుడి కాలు
డిండి మండల కేంద్రంలోని బస్ స్టేషన్ లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నుండి సత్యనారాయణ అనే ప్రయాణికుడు దిగుతుండగా డ్రైవర్ గమనించకుండా నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో, ప్రయాణీకుడు బస్ టైర్ల కింద పడడంతో కాలు నుజ్జునుజ్జైంది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించారు.