Mar 19, 2025, 15:03 IST/నల్గొండ నియోజకవర్గం
నల్గొండ నియోజకవర్గం
చిట్యాల: వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
Mar 19, 2025, 15:03 IST
చిట్యాల పట్టణ శివారులోని ఆదర్శ రైతు కొణతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి వనరులు, నీటి సంరక్షణ కోసం రైతు తీసుకున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రైతులతో ఆమె మాట్లాడుతూ తక్కువ నీటి వినియోగం గల పంటల సాగు పట్ల రైతులు ఆసక్తి చూపాలని సూచించారు. వారి వెంట వ్యవసాయ అధికారులు ఉన్నారు.