రైతులకు రైస్ మిల్లర్లు తగిన ధర చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం అన్నారు. మండల కేంద్రంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి రైస్ మిల్లర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం తేమ గురించి, గిట్టుబాటు ధర గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే అగ్రికల్చర్ అధికారులను, మమ్మల్ని సంప్రదించవచ్చు అని రైతులకు హామీ ఇచ్చారు.