పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడలో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం శనివారంవిజయవంతమయ్యింది. ఈ శిబిరంలో పోలీసులు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు దాదాపు 90 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, పోలీస్ సిబ్బందితో పాటు జనయేత్రీ, ఫ్రెండ్స్, మేధ ఫౌండేషన్స్ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు.