నల్గొండ: సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి

71చూసినవారు
నల్గొండ: సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి
నల్గొండ జిల్లా కలెక్టర్ ఐలా త్రిపాఠి ఆదేశానుసారం బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో కుల గణన సర్వే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించాలని మండల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో,  తహశీల్దార్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్