తప్పిపోయిన బదిరబాలిక

78చూసినవారు
తప్పిపోయిన బదిరబాలిక
మిర్యాలగూడ పట్టణంలోని రాం నగర్ కి చెందిన బదిరబాలిక కొండేటి సిరి(16) ఇంటినుంచి తప్పిపోయినట్లు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. అవంతిపురం బదిరపాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సిరి అనే బాలిక ఈ నెల 18రాత్రి 7గంటలకు రాంనగర్ లోని ఇంటి నుంచి సరస్వతి స్కూల్ వెనుక వీధి గుండా తడకమల్ల రోడ్డు నుంచి తప్పిపోయి తిరిగిరాలేదని, కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు 7075050756, 8341832531 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :