మిర్యాలగూడ వనిత డైమండ్ క్లబ్ అధ్యక్షురాలిగా రాయపూడి ఆశాలత
జగన్ నియామకమయ్యారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆర్సీ డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా లయన్స్ వనిత డైమండ్ క్లబ్ ను ఏర్పాటు చేశారు. వనిత క్లబ్ అధ్యక్షురాలిగా రాయపూడి ఆశాలత
జగన్, కార్యదర్శిగా మాశెట్టి గీత, కోశాధికారిగా సామా సంతోషిని లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వనిత డైమండ్ క్లబ్ అధ్యక్షురాలు రాయపూడి ఆశాలత మాట్లాడుతూ మిర్యాలగూడకు పేరు తెచ్చే విధంగా వనిత డైమండ్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. అలాగే ప్రజల అత్యవసర సమస్యలు గుర్తించి అక్కడికి వెళ్లి మరీ సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నిస్సహాయులైన వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయపూడి
జగన్ మోహన్ రావు, డైమండ్ శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, మురారి, నాయుడు, భాస్కర్, సామా శ్రీనివాస్, కోలా సైదులు తదితరులు పాల్గొన్నారు.