గాంధీజీ ఫౌండేషన్, డాక్టర్ కోడి శ్రీనివాసులు గత పది సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంలో ముందుంటూ ఈ సంవత్సరం గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ ద్వారా అనేకమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకుగాను గుర్తించిన తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారు మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియం నందు మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు- 2024ను తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్, బీసీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు గోపిశెట్టి నిరంజన్ గార్ల చేతుల మీదుగా అందించి ఘనంగా సత్కరించారు. అవార్డు తీసుకున్న డాక్టర్ కోడి శ్రీనివాసులును స్థానిక నాంపల్లి గాంధీజీ పాఠశాలలో గురువారం గజమాల, శాలువాతో ఘనంగా సన్మానించినారు.