పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ డిఎస్పి అభ్యర్థి కొంగరి లింగస్వామి నారాయణపురం మండలంలోని సర్వేలు గ్రామంలో గడప గడపకు వెళ్లి తమ ఓటును చెప్పుల గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరారు. శనివారం చౌటుప్పల్ పట్టన కేంద్రంలో జరిగే రోడ్ షో కి పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ వస్తున్న నేపథ్యంలో ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.