గత పదేళ్ల నుంచి పెద్దవూర మండలం పోతునూరు గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నానని, తనకు గృహలక్ష్మీ పథకం వర్తింపజేయాలని తుమ్మ దుర్గమ్మ శ్రీను మంగళవారం సీఎం కేసీఆర్ను కోరారు. గుడిసెలో ఉండి ప్రజాసేవ చేస్తున్నానని, గృహలక్ష్మీ పథకానికి అప్లై చేసుకున్నా.. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నాపేరు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.