తెలంగాణ మలిదశ ఉద్యమ నేతగా జెఏసి చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాం చేసిన సేవలు చిరస్మరనీయం అని మిర్యాలగూడ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్, మాలోత్ దశరథ్ నాయక్ లు అన్నారు. శుక్రవారం అమరవీరుల స్థూపంవద్ద వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రజలకు చేర్చి ప్రజలందరినీ ఉద్యమంలో భాగస్వామ్యంచేసిన కోదండరాంని రాష్ట్రప్రభుత్వం ఎమ్మెల్సీగా ఎంపికచేసి తగినగుర్తింపు కల్పించడంపట్ల హర్షం వ్యక్తంచేశారు.