ప్రస్తుత రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టాన్ని తీసుకురానున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జునసాగర్, తిరుమలగిరి సాగర్, నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి శనివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.