సాగర్: గిట్టుబాటు అందించేందుకు మార్కెట్ పాలక మండలి కృషి చేయాలి
రైతు సంక్షేమానికి, గిట్టుబాటు అందించేందుకు మార్కెట్ పాలక మండలి కృషి చేయాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. సోమవారం హాలియా మార్కెట్ యార్డులో నిర్వహించిన మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి నావంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రైతులు పండించిన దాన్యం, అపరాలు, పత్తి తదితర పంటలకు ప్రభుత్వం అందించే మద్దతు ధర వారికి అందించేందుకు పాటుపడాలన్నారు.