వికారాబాద్ జిల్లా, బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి కిడ్నీ, నిమోనియా సమస్యతో హైదరాబాద్ లో బొల్లారం రోడ్డులో గల మమత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. చికిత్సకు డబ్బులు లేక సతమవుతున్నాడని తెలుసుకొని నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంకి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు శుక్రవారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్ళి 20, 000రూ. ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.