నాడు జరిగిన తెలంగాణ రైతంగా పోరాట స్పూర్తితో నేడు దేశంలో రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు
శుక్రవారం నాడు సిపిఎం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని అయిటిపాముల, చెర్వు అన్నారం, గార్లబాయి గూడెం పందెనపల్లి ఈదులూరు, మునుకుంట్ల కలిమేర, దుగినెల్లి గ్రామాలల్లో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రైతంగా పోరాటం లో అసువులు బాసిన అమరవీరుల స్థూపలకు, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం లో భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం సాయుధ రైతంగా పోరాటం నడిపింది కమ్యూనిస్ట్ లు మాత్రమేనని కానీ బీజేపీ నాయకులు కనీస అవగహన లేకుండా సాయుధ పోరాటాన్ని వక్రీకరించి చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
నిజాంకు వ్యతిరేకంగా దేశముక్ లకు, దొరలకు వ్యతిరేకంగా వారి ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకమై పోరాడిందన్నారు పేదలకు వేల ఎకరాల భూమి పంచింది కమ్యూనిస్ట్ లు మాత్రమే అన్నారు అట్లాంటి చరిత్ర ను గుర్తుచేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ మండలం లోని గ్రామాల్లో పోరాడి ప్రాణాలోదిన అమరుల ను స్మరిస్తూ వారి కి శ్రద్ధాంజలి ఘట్టిస్తు మండలం వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది
కేంద్రం తెచ్చిన నల్ల చట్టఉపసంహారణ సందర్బంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, విద్యుత్ సవరణ చట్టాల్ని ఉపసంహరించుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వం అర్హులు అందరికి రైతు బంధు, బీమా కల్పించి పోడు, కౌలు రైతులని ఆదుకోవాలని, రైతు రుణ మాఫీ చేయాలని కోరారు.
57 సంవత్సరాలు నిండిన వారికి అందరికీ పేన్షన్ అందజేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు మండల కమిటీ సభ్యులు చిలుముల రామస్వామి, మురారి మోహన్, కక్కిరేణి రామస్వామి, ఇటుకల సురేందర్, ఊట్కూరు యాదయ్య, జాల రమేష్, దండేంపల్లి శ్రీను, గడగొజు రవీంద్ర చారి గుడుగుంట్ల రామక్రిష్ణ, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శిలు చిలుముల కృష్ణ, గంట వెంకన్న, కొమ్మన బోయిన అంజయ్య, వంగూరి వెంకన్న, గద్దపాటి యాదయ్య గద్ద పాటి ఇస్తరి, పెంజర్ల కృష్ణ, జాల ఆంజనేయులు, శాఖ సభ్యులు పాల పిచ్చయ్య, బాలనర్సింహ, నంద్యాల రామిరెడ్డి, కొరివి దుర్గయ్య, గణేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.