నల్గొండ జిల్లాలోని శైవక్షేత్రాలు కార్తిక మాసం సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే ఆలయాలకు పోటెత్తిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుడిని దర్శించుకున్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. జిల్లాలోని చెరువుగట్టు, వాడపల్లిలోని ఆలయాల్లో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.