నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నకిరేకల్ పట్టణానికి చెందిన మైనార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతికి, పవిత్రమైన ప్రేమకు సహనానికి ప్రతిక రంజాన్ మాసం అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ముస్లిం సోదరులు, నకిరేకల్ పట్టణ ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.