తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారని, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు.