సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి , కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్లను ఆదేశించారు. శుక్రవారం ఆమె కట్టంగూరు మండల కేంద్రం, శాలిగౌరారం మండలం వల్లాల, నకిరేకల్ ల లో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను తనిఖీ చేశారు. సర్వే సందర్భంగా అన్ని ఇండ్లను కవర్ చేయాలని సర్వే నిర్వహించిన అనంతరం ఇళ్లకు స్టికర్ అతికించాలని ఆమె ఆదేశించారు.