దొంగలించబోయి... దొరికిపోయాడు

61చూసినవారు
నల్గొండ పట్టణలోని లక్ష్మీ గార్డెన్స్‌లో మంగళవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాజీ సర్పంచ్ జేబులోంచి డబ్బులు దోచుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతడిని పట్టుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు వివరాలు అడగగా తికమక సమాధానం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్