1000 కోట్ల రూపాయల నిధులతో ఏఎంఆర్పి ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల, లైనింగ్ మరమ్మత్తు పనులను, చేపట్టనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం కనగల్ మండల కేంద్రంలోని మైలా సముద్రం చెరువు వద్ద సాగునీటి పరిస్థితిని పరిశీలించారు. 2లక్షల 20వేల ఎకరాలకు గాను ఇప్పటివరకు రెండు లక్షల 15 వేల ఎకరాలను సాగునీటికి అందించామన్నారు.