ఆరుగాలం కష్టపడుతున్న రైతుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీసం మద్దతు ధర చట్టం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య భవన్లో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.