నల్గొండ: బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

81చూసినవారు
నల్గొండ: బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
నల్గొండ మండలంలోని జి. చెన్నారం, కొత్తపల్లిలో గురువారం బిజెపి మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు పాల్గొని మాట్లాడుతూ. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, పోతే పాక లింగస్వామి, సాంబయ్య, నాగరాజు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్