తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 7500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎస్సీ,ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ సోమవారం నల్గొండ కలెక్టర్ త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఉన్నత సాంకేతిక విద్యకు దూరమవుతున్నారని వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేయాలని శివకుమార్ కలెక్టర్ కోరారు.