రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పెద్ద బండకు చెందిన ఇద్దరు యువకులు బైకుపై సాగర్ రోడ్డు వైపు వెళ్తుండగా అదే సమయంలో పెట్రోల్ బంక్ నుంచి నల్గొండ పట్టణంలోకి వస్తున్న ఓ బైకును ఎదురుగా వెళ్లి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.