మోత్కూరు: వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ పెంచి ఇవ్వాలి
ఎన్నికల ముందు వికలాంగులకు రూ. 6వేలు, వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ శనివారం యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కమిషనర్ కి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డివిజన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాజు, గుండు శ్రీను, ఎర్రబెల్లి నాగేశ్వర్, పురుగుల లింగయ్య పాల్గొన్నారు.