బెంగాల్లోని శిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచడం త్రీవ వివాదానికి దారితీసిన విషయం విదితమే. తాజాగా వాటి పేర్లు సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సింహాల పేర్లు మార్చడంతో ఈ కేసు వివాదం ఇంతటితో ముగిసినట్లు అదనపు అడ్వకేట్ పేర్కొన్నారు. సింహాల పేర్లు మారడంతో విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) హర్షం వ్యక్తం చేసింది.