తాగు నీటి కోసం ధర్నా
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కనుక్కుర్తి గ్రామంలో గత నాలుగు రోజుల నుండి నీరు రావడంలేదు. విసిగిపోయిన గ్రామస్తులు బుధవారం ఉదయం రామాలయం టెంపుల్ దగ్గర ధర్నాకు. దిగారు. గ్రామస్తులు చేసే ధర్నా వలన ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుండి కదలము అని గ్రామస్తులు అంటున్నారు.